Punarnavi Bhargavi: తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సినీ నటి పునర్నవి భార్గవి

Actress Punarnavi Bhargavi suffering from lungs problems
షార్ట్స్‌లో చూడండి
ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సినీ నటి పునర్నవి భార్గవి. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులను ఆమె బాగా ఆకట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. చిన్న సినిమాల్లో మాత్రం ఆమె కనిపించింది. తాజాగా ఆమె అభిమానులకు బ్యాడ్ న్యూస్ ను చెప్పింది. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రకటించింది.

గత కొన్ని రోజులుగా తాను ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్నట్టు ఆమె తెలిపింది. కొత్త సంవత్సరాన్ని అనారోగ్యంతో ప్రారంభిస్తున్నానని బాధాకరమైన విషయాన్ని వెల్లడించింది. తాను అనారోగ్యం బారిన పడటం ఇదే చివరి సారి కావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ మేరకు భార్గవి పెట్టిన మెసేజ్ ఆమె అభిమానులను చాలా బాధకు గురి చేస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
Go Back to Shorts
Punarnavi Bhargavi
Tollywood
Bigg Boss
Health Problem

More Telugu News