41 రోజుల్లో అయ్యప్పను దర్శించుకున్న 30 లక్షలమంది.. రూ. 222.98 కోట్ల ఆదాయం
- భక్తుల దర్శనం అనంతరం గత రాత్రి ఆలయం మూసివేత
- తిరిగి ఈ నెల 30న తెరుచుకోనున్న ఆలయం
- జనవరి 14న మకరవిలక్కు పూజలు
- 20న తిరిగి ఆలయం మూత
అనంతరం కలశాభిషేకం పూజలు నిర్వహించారు. రాత్రి భక్తుల దర్శనం ముగిసిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. మకరజ్యోతి ఉత్సవాల (మకరవిలక్కు) కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. జనవరి 14న మకరవిలక్కు పూజలు నిర్వహిస్తారు. 20న ఆలయాన్ని మూసివేస్తారు. దీంతో వార్షిక యాత్రా సీజన్ ముగుస్తుంది.