బలూచిస్థాన్‌ను కుదిపేసిన పేలుళ్లు.. ఐదుగురు పాక్ జవాన్ల మృతి
- కోహ్లు జిల్లాలో పేలిన శక్తిమంతమైన ఐఈడీ
- ‘లీడింగ్’ పార్టీ సమీపంలో పేలుడు
- క్వెట్టాలో జరిగిన వేర్వేరు చోట్ల జరిగిన గ్రనేడ్ దాడిలో 12 మందికి గాయాలు
మరోవైపు, క్వెట్టాలోని శాటిలైట్ టౌన్‌లో ఉన్న పోలీస్ చెక్ పోస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పోలీసులు, ఐదుగురు పౌరులు ఉన్నారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే క్వెట్టాలో జరిగిన మరో గ్రనేడ్ దాడిలో నలుగురు గాయపడ్డారు. దేశం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న వేళ ఈ దాడులు జరగడం గమనార్హం.