ఆసక్తి కలిగిస్తున్న ‘కొరమీను’ ట్రైలర్... డిసెంబర్ 31న మూవీ గ్రాండ్ రిలీజ్
Add ap7am to your home Screen

ఆసక్తి కలిగిస్తున్న ‘కొరమీను’ ట్రైలర్... డిసెంబర్ 31న మూవీ గ్రాండ్ రిలీజ్

Korameenu trailer out now
  • ఆనంద్ రవి హీరోగా కొరమీను
  • శ్రీపతి కర్రి దర్శకత్వంలో చిత్రం
  • వినూత్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం 
  • నేడు ట్రైలర్ రిలీజ్
ఆనంద్ రవి, కిశోరి ధత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కొరమీను'. ఈ చిత్రం నుంచి నేడు ట్రైలర్ రిలీజైంది. "విజ‌య‌వాడ‌లో నేర‌స్థుల‌కు సింహ స్వ‌ప్నంగా ఉండే ఐపీఎస్ ఆఫీస‌ర్ మీసాల రాజు అలియాస్ సీతారామ‌రాజు విశాఖప‌ట్నం సిటీకి ట్రాన్స్‌ఫ‌ర్స్ అయ్యారు" అనే డైలాగ్‌తో కొర‌మీను ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది. 

కొరమీను చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీప‌తి క‌ర్రి ద‌ర్శ‌క‌త్వంలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 31న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. స్టోరీస్ ఆఫ్ ఇగోస్ అనే క్యాప్ష‌న్ పెట్టారంటేనే సినిమా క‌థాంశ‌మేంటో అర్థం చేసుకోవ‌చ్చు. 

కొర‌మీను సినిమా ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్ సినిమాపై ఓ రేంజ్ అంచ‌నాల‌ను పెంచితే... ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళుతోంది.

కాగా, ‘కొరమీను’ చిత్రాన్ని గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మ‌హేశ్వ‌ర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో డిసెంబ‌ర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. 

ఈ చిత్రంలో హరీశ్ ఉత్తమన్, శత్రు, రాజా రవీంద్ర, గిరిధర్, 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్, ఆర్కే నాయుడు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Advertisement
Korameenu
Trailer
Anand Ravi
Kishori Dhatrak
Sripathy Karri
Tollywood

More Telugu News