ఫ్యామిలీ వీక్ తరువాత శ్రీహాన్ లో మార్పు వచ్చింది: శ్రీ సత్య

Sri Sathya Interview
  • ఆరో పొజిషన్లో ఉండగా జరిగిన శ్రీ సత్య ఎలిమినేషన్
  • రేవంత్ ... శ్రీహాన్ లతో ఫ్రెండ్షిప్ ఎక్కువని వ్యాఖ్య 
  • ఇనయాను రెచ్చగొట్టి ఉండవలసింది కాదని వెల్లడి 
  • కీర్తిని ఇమిటేట్ చేసినందుకు ఫీలైనట్టుగా చెప్పిన శ్రీ సత్య
బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి శ్రీ సత్య ఆటతీరును చూస్తూ వచ్చినవారు, తప్పకుండా ఆమె టాప్ ఫైవ్ లో ఉంటుందని అనుకున్నారు. కానీ ఆరో పొజిషన్లో ఉండగానే ఆమె బిగ్ బాస్ హౌస్ ను వదిలిపెట్టి రావలసి వచ్చింది. గ్లామర్ పరంగాను .. ఆటల పరంగాను బిగ్ బాస్ హౌస్ కి కళను తీసుకొచ్చిన శ్రీ సత్య ఎలిమినేట్ కావడం ఆమె అభిమానులను నిరాశ పరిచింది. తాజాగా బీబీ కేఫ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ సత్య మాట్లాడుతూ .. "అవతలివారి విషయంలో ఒక అవగాహనకి వచ్చేవరకూ నేను నా చుట్టూ ఒక బౌండరీ గీసుకుని ఉంటాను. ఎదుటివారినిబట్టే నా బిహేవియర్ ఉంటుంది. అందువలన నాకు యాటిట్యూడ్ ఎక్కువని స్టార్టింగ్ లో హౌస్ లోని వాళ్లంతా అనుకున్నారు. అందరితో నేను బాగానే ఉన్నాను, కాకపోతే రేవంత్ .. శ్రీహాన్ లతో కాస్త ఎక్కువగా చనువుగా ఉన్నాను" అంది. "శ్రీహన్ విషయానికొస్తే .. ఫ్యామిలీ వీక్ తరువాత తాను మారిపోయాడు. ఫ్యామిలీ వీక్ లో వచ్చిన ఇన్ పుట్స్ వలన అతను అలా మారిపోయాడేమోనని అనుకున్నాను. సిరి వచ్చి ఏమైనా చెప్పిందేమోనని నేను రేవంత్ తో అన్నమాట నిజమే. నేను కాస్త వెటకారం తగ్గించాలని మా ఇంట్లో వారు కూడా చెప్పారు. ఇనయాను రెచ్చగొట్టడం .. కీర్తిని ఇమిటేట్ చేయడం నాకు కూడా ఎలాగో అనిపించింది. అందుకే వాళ్లకి సారీ చెప్పేశాను" అంటూ చెప్పుకొచ్చింది.
Advertisement
Sri Sathya
Revanth
Srihan
Bigg Boss

More Telugu News