మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్

CM Jagan attends Malladi Vishnu daughter wedding
  • మంగళగిరిలో మల్లాది కుమార్తె నాగదుర్గ వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
  • పెళ్లికి హాజరైన మంత్రి జోగి రమేశ్ తదితరులు
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె డాక్టర్ లలిత నాగదుర్గ వివాహం నేడు మంగళగిరి సీకే కన్వెన్షన్స్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం జగన్ కు మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వివాహ మండపం వద్దకు చేరుకున్న సీఎం జగన్ వధూవరులు డాక్టర్ లలిత నాగదుర్గ, డాక్టర్ సాయి సూర్యతేజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి ఆశీస్సులు అందజేశారు. ఈ వివాహానికి మంత్రి జోగి రమేశ్, ఇతర వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు.
Go Back to Shorts
Jagan
Malladi Vishnu
Wedding
Mangalagiri
YSRCP

More Telugu News