పాపం రొనాల్డో.. మైదానంలో వెక్కివెక్కి ఏడ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం
- పోర్చుగల్‌కు షాకిచ్చి తొలిసారి సెమీస్ చేరిన మొరాకో
- 50 నిమిషాల పాటు రొనాల్డోను బెంచ్ పై ఉంచిన కోచ్
- మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో తీవ్ర భావోద్వేగం
90 నిమిషాలు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన మొరాకో ప్లేయర్లు పోర్చుగల్ పని పట్టారు. దీంతో 1966, 2006లో తర్వాత సెమీస్ చేరాలని ఆశించిన పోర్చుగల్‌కు, కెరీర్‌లో వెలితిగా ఉన్న కప్పు అందుకోవాలని ఆశించిన రొనాల్డోకు నిరాశ తప్పలేదు. ప్రిక్వార్టర్స్‌లో రొనాల్డోను చాలాసేపు బెంచ్‌పై ఉంచి రమోస్‌ను ఆడించి హిట్ కొట్టిన పోర్చుగల్ ఈసారి కూడా అదే చేయబోయి బోల్తా కొట్టింది. 50 నిమిషాల దాకా రొనాల్డోను బెంచ్ పై ఉంచి కోచ్ తప్పు చేశాడు. జట్టు ఓటమితో రొనాల్డో తీవ్ర కలత చెందాడు. వెక్కివెక్కి ఏడుస్తూ మైదానం వీడాడు.