సోదరి వివాహం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేసిన యువతి.. వీడియో వైరల్
- వివాహం కోసం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు
- బంధువులు, స్నేహితులను విమానంలో తీసుకెళ్లిన వైనం
- వీడియోకు కోటికిపైగా వ్యూస్
ఈ నేపథ్యంలో ఓ జంట వివాహం కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి విమానంలో పెళ్లికి బయలుదేరింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ శ్రేయా షా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తన సోదరి వివాహం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత విమానంలోని వారందరినీ చూపించారు. చివర్లో పెళ్లితో ఒక్కటి కాబోతున్న జంటను చూపించారు. శ్రేయా షా చెబుతున్న దాని ప్రకారం ఆ జంట వివాహం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరుగుతుంది. ఈ వీడియోను ఇప్పటికే కోటిమందికిపైగా వీక్షించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి