ఒకే ఓవర్ లో ఏడు సిక్సులతో రుతురాజ్ గైక్వాడ్ ప్రపంచ రికార్డు.. వీడియో ఇదిగో!
- విజయ్ హజారే ట్రోఫీలో ఆవిష్కృతమైన అద్భుతం
- యూపీ బౌలర్ శివ్ సింగ్ ఓవర్లో ఏడు సిక్సులు బాదిన రుతురాజ్
- 220 పరుగులతో అజేయంగా నిలిచిన యువ బ్యాటర్
మహారాష్ట్ర ఓపెనర్, టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ యూపీపై మెరుపు డబుల్ సెంచరీ సాధించాడు. 159 బంతుల్లో అజేయంగా 220 పరుగులు చేశారు. ఈ క్రమంలో ఒకే ఓవర్ లో ఏడు సిక్సులు బాది ప్రపంచ రికార్డును సాధించాడు. యూపీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ్ సింగ్ బౌలింగ్ లో ఈ ఘనతను సాధించాడు. ఈ ఓవర్ లో ఐదో బంతి నోబాల్ గా పడటంతో... శివ్ సింగ్ అదనంగా మరో బంతిని వేయాల్సి వచ్చింది. ఆ బంతిని కూడా గైక్వాడ్ బౌండరీ వెలుపలికి తరలించాడు. దీంతో, ప్రపంచ క్రికెట్లో ఒకే ఓవర్ లో ఏడు సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా రుతురాజ్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.