Nagabhushanam: దేవుడు పరలోకానికి రమ్మంటున్నాడంటూ పాస్టర్ వింత ప్రవర్తన

Pastor unusual behavior in Krishna district
షార్ట్స్‌లో చూడండి
కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లిలో ఓ పాస్టర్ తన వింత ప్రవర్తనతో కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాడు. అతడి పేరు నాగభూషణం. ఆయనకు సొంత చర్చి కూడా ఉంది. అయితే కొన్నిరోజులుగా ఆయన ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. దేవుడు తనతో మాట్లాడుతున్నాడని, పరలోకానికి రమ్మంటున్నాడని చెబుతున్నాడు. 

అంతేకాదు, ఓ గొయ్యి తీసి తనను అందులో పూడ్చివేస్తే, దేవుడు మూడ్రోజుల్లో లేచి తిరిగొచ్చినట్టు, తాను కూడా లేచి వస్తానని అంటున్నాడు. ఈ క్రమంలో, తన చర్చిలోనే ఓ గొయ్యి తవ్విస్తుండడంతో అందరిలోనూ ఆందోళన బయల్దేరింది.

దీనిపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు పాస్టర్ ను విచారిస్తున్నారు. గత పది రోజుల నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నాడని పాస్టర్ నాగభూషణం కుటుంబ సభ్యులు వాపోయారు.
Go Back to Shorts
Nagabhushanam
Pastor
Gollanapalli
Krishna District

More Telugu News