సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు భారీ టెలిస్కోపును మోహరించిన చైనా

14-11-2022 Mon 21:00 | Science
  • అంతరిక్ష పరిశోధనలపై దృష్టిపెట్టిన చైనా
  • టిబెట్ పీఠభూమిపై దావోచెంగ్ రేడియో టెలిస్కోప్ నిర్మాణం
  • రూ.113 కోట్ల వ్యయంతో భారీ టెలిస్కోప్
  • 313 డిష్ లతో కూడిన నిర్మాణం
ఎలక్ట్రానిక్ విప్లవంతో ఎంతో వాణిజ్య ప్రగతి సాధించిన చైనా, గత కొంతకాలంగా అంతరిక్ష పరిశోధనలపై తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. అపారమైన అణుశక్తిని అందించే కృత్రిమ సూర్యుడ్ని రూపొందిస్తున్న చైనా, అసలు సూర్యుడి గుట్టుమట్లు తెలుసుకునేందుకు కూడా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. 

ఈ క్రమంలో టిబెట్ పీఠభూమిపై భారీ టెలిస్కోప్ వ్యవస్థను మోహరించింది. ఈ టెలిస్కోపిక్ డిష్ ల సమాహారానికి దావోచెంగ్ రేడియో టెలిస్కోప్ గా నామకరణం చేశారు. ఇటీవలే ఈ టెలిస్కోప్ వ్యవస్థ నిర్మాణం పూర్తయింది. రోదసి నుంచి వెలువడే అత్యంత బలహీన సంకేతాలను కూడా పసిగట్టే సామర్థ్యం ఈ టెలిస్కోప్ వ్యవస్థ సొంతం. ఈ టెలిస్కోప్ వ్యవస్థ ట్రయల్స్ ను వచ్చే ఏడాది జూన్ లో నిర్వహించనున్నారు. 

రూ.113 కోట్ల వ్యయంతో చైనా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రధానంగా సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఈ రేడియో టెలిస్కోప్ ను వినియోగించనున్నారు. సూర్యుడి ప్రభావం రోదసిపైనా, భూ వాతావరణంపైనా ఎలా ఉంటుందన్నది తెలుసుకోనున్నారు.

ఇక ఈ భారీ టెలిస్కోప్ లో భాగంగా 313 రేడియల్ డిష్ లను వినియోగించారు. 6 మీటర్ల నిడివితో ఉండే ఈ డిష్ ల సమాహారం 3.14 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది.
ChinaDaocheng Radio TelescopeSunTibet

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more