తన కుమార్తె వివాహానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన అలీ

Ali invites Chiranjeevi to his daughter wedding
  • ఇటీవలే డాక్టర్ పట్టా పుచ్చుకున్న అలీ కుమార్తె ఫాతిమా
  • షెహనాజ్ తో ఫాతిమా పెళ్లి
  • ఈ నెల 27న వివాహం
  • ప్రముఖులను ఆహ్వానిస్తున్న అలీ
ప్రముఖ సినీ కమెడియన్ అలీ, జుబేదా దంపతుల పెద్ద కుమార్తె ఫాతిమా త్వరలోనే ఓ ఇంటిదవుతోంది. ఇటీవలే డాక్టర్ పట్టా పుచ్చుకున్న ఫాతిమా వివాహం షెహనాజ్ తో నవంబరు 27న జరగనుంది. ఈ పెళ్లికి హైదరాబాదులోని అన్వయ కన్వెన్షన్స్ వేదికగా నిలవనుంది. 

కుమార్తె పరిణయం నేపథ్యంలో, అలీ దంపతులు అతిథులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల సీఎం జగన్ తదితరులను కలిసి శుభలేఖ అందించిన అలీ-జుబేదా తాజాగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. తమ కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరు కావాలంటూ చిరంజీవిని ఆహ్వానించారు. 

అలీ-జుబేదా దంపతులను చిరంజీవి తన నివాసంలో సాదరంగా ఆహ్వానించారు. వారిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని తన వాత్సల్యాన్ని ప్రదర్శించారు. కుమార్తె పెళ్లి చేస్తున్న అలీకి శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
Ali
Chiranjeevi
Fatima
Wedding
Tollywood

More Telugu News