ఎలాన్ మస్క్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే.. ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ
- కంపెనీ సామర్థ్యాన్ని పెంచడమే తాను చేసిన తప్పన్న డోర్సే
- ట్విట్టర్ ఉద్యోగులు మానసికంగా దృఢంగా ఉంటారన్న సహ వ్యవస్థాపకుడు
- ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్నాక ఉద్యోగాల్లో కోతలు
44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్న తర్వాత సంస్థలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకుంటూనే పలు విభాగాల హెడ్లను తొలగించారు. అలాగే, ట్విట్టర్లో ఉద్యోగుల సంఖ్యను సగానికి కుదించాలని నిర్ణయించారు. కాగా, డోర్సే మే నెలలోనే ట్విట్టర్ బోర్డు నుంచి తప్పుకున్నారు. డోర్సే 2006లో మరో ముగ్గురితో కలిసి ట్విట్టర్‌ను స్థాపించారు. 2015లో ట్విట్టర్‌కు సీఈవోగా నియమితులయ్యారు. గతేడాది నవంబరులో సీఈవో పదవికి రాజీనామా చేసిన ఆయన, ఈ ఏడాది మేలో డైరెక్టర్ బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు.