తెలంగాణ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా పోలీసులకు పతకాలు
- విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్‌కు సర్వోన్నత పోలీసు పతకం
- భద్రాద్రి కొత్తగూడెం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రవి, చెర్ల సీఐ రాజులకు శౌర్య పతకాలు
- 16 మందికి మహోన్నత సేవా పతకాలు
తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్ ప్రతాప్‌కు సీఎం సర్వోన్నత పోలీసు పతకం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రవి, చెర్ల సీఐ రాజులకు తెలంగాణ పోలీస్ శౌర్య పతకాలను ప్రకటించారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సంపత్, గ్రేహౌండ్స్‌లోని మరో ఏడుగురిని శౌర్య పతకాలు వరించాయి. 16 మందికి మహోన్నత సేవా పతకాలు, 94 మందికి ఉత్తమ సేవా పతకాలు, 50 మంది కఠిన సేవా పతకాలు, మరో 461 మంది సేవా పతకాలు అందుకోనున్నారు.