విజయవాడలో గ్రాండ్ గా 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... 'మస్సా మస్సా' వీడియో సాంగ్ రిలీజ్

Massa Massa Video Song From Peddi released
  • రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రం 'పెద్ది'
  • ఈ సినిమా నుంచి 'మస్సా మస్సా' వీడియో సాంగ్ విడుదల
  • పాటలో సినిమా కోసం చరణ్ పడిన కష్టాన్ని చూపించిన వైనం
  • ఈ పవర్‌ఫుల్ ట్రాక్‌కు ఏఆర్ రెహమాన్ సంగీతం 
  • జూన్ 4న పాన్-ఇండియా స్థాయిలో సినిమా విడుదల
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. ఈ సాయంత్రం విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో 'మస్సా మస్సా' అనే పవర్‌ఫుల్ సాంగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే ఆడియో రూపంలో సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఈ పాట, ఇప్పుడు మేకింగ్ విజువల్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

ఈ వీడియో సాంగ్‌లో సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టాన్ని, ఆయన డెడికేషన్‌ను కళ్లకు కట్టినట్టు చూపించారు. పాత్రకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవడం కోసం, యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన చేసిన కఠినమైన కసరత్తులు, శిక్షణకు సంబంధించిన విజువల్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చరణ్ హార్డ్ వర్క్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ హై-ఎనర్జీ ట్రాక్‌కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, విశాల్ మిశ్రా తన గాత్రంతో ప్రాణం పోశారు. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో, స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా 'పెద్ది' రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ 
Go Back to Shorts
Massa Massa
Peddi
Video
Ram Charan
Janhvi Kapoor
Buchibabu Sana
AR Rahman

More Telugu News