Elon Musk: ట్విట్టర్ నుంచి వెళ్లిపోయిన మస్క్ మాజీ ప్రియురాలు !

After Elon Musk takeover Amber Heard Twitter profile vanishes Netizens are concerned
షార్ట్స్‌లో చూడండి
హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ గుర్తుందా..? ఇటీవల తన మాజీ భర్త జానీడెప్ తో కోర్టు వివాదంలో ఓడిపోయిన ఈ నటి.. తాజాగా ట్విట్టర్ లో తన ఖాతాను డిలీట్ చేసేసింది. అంబర్ హెర్డ్ ఒకప్పుడు టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తో కొంత కాలం పాటు సహ జీవనంలో పాలు పంచుకుంది. ఆ తర్వాత వీరు ఎవరి దారి వారు చూసుకున్నారు. 

అయితే, తాజా పరిణామం ఏమిటంటే.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడం తెలిసిందే. దీంతో ట్విట్టర్ లో తన ఖాతా కొనసాగించడం అంబర్ కు నచ్చలేదేమో, ఆమె తన ఖాతాను తొలగించుకుంది. అయితే పూర్తిగా డిలీట్ చేసిందా? లేక ఆమె ఇనాక్టివ్ లో ఉంచిందా..? లేక అంబర్ అకౌంట్ ను ఎలాన్ మస్క్ డీయాక్టివేట్ చేశాడా? అన్నవి ఇప్పుడు నెటిజన్ల మదిలో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి. ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలైన అంబర్ ట్విట్టర్ ఖాతా ఉందా? అన్న సందేహం కొందరికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
Go Back to Shorts
Elon Musk
twitter takeover
Amber Heard
Twitter profile
deleted

More Telugu News