సమంతపై ప్రశంసల జల్లు కురిపించిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్

Stunt Director Yannick Ben heaps praise on Samantha
  • 'యశోద' చిత్రంలో నటించిన సమంత
  • నవంబరు 11న విడుదల కానున్న యశోద
  • 'యశోద' చిత్రానికి స్టంట్ డైరెక్టర్ గా యానిక్ బెన్
  • సమంత అంకితభావం ఉన్న నటి అని కితాబు
అందాలభామ సమంత నటించిన లేటెస్ట్ మూవీ 'యశోద' ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో హైప్ లభిస్తోంది. కాగా, హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ యానిక్ బెన్ 'యశోద' చిత్రానికి పనిచేశారు. సమంతతో పోరాట దృశ్యాలను తెరకెక్కించడం పట్ల యానిక్ బెన్ స్పందించాడు. 

సమంత అంకితభావంతో పనిచేస్తుందని, అలాంటి నటితో పనిచేయడం ఎంతో బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. సమంత ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తుందని, ఓ యాక్షన్ డైరెక్టర్ గా అంతకంటే ఇంకేం కోరుకుంటామని తెలిపాడు. యశోద చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ చూస్తే నిజమైన పోరాట దృశ్యాల్లా అనిపిస్తాయని, స్టంట్స్ రియల్ గా వచ్చేందుకు సమంత ఎంతో సహకరించిందని కొనియాడాడు. 

కాగా, సమంతతో యానిక్ బెన్ కు ఇది రెండో ప్రాజెక్టు. గతంలో సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ కు కూడా యానిక్ బెన్ పనిచేశాడు. యానిక్ బెన్ హాలీవుడ్ లో స్టంట్ డైరెక్టర్ గా ఎంతో గుర్తింపు పొందారు. డన్ కిర్క్, ఇన్సెప్షన్ తదితర హాలీవుడ్ చిత్రాలకు యానిక్ బెన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించాడు. 

ఇటీవల కాలంలో భారత్ లో వివిధ భాషల చిత్రాలకు పనిచేస్తున్నాడు. తాను ఎప్పుడూ నటీనటుల భద్రతకు ప్రాధాన్యమిచ్చే రీతిలో స్టంట్ సీక్వెన్స్ లు ప్లాన్ చేస్తానని, అదే సమయంలో పోరాట దృశ్యాలు వాస్తవికతను ప్రతిబింబించేలా కృషి చేస్తానని యానిక్ బెన్ వెల్లడించాడు.
Go Back to Shorts
Yannick Ben
Samantha
Yashoda
Stunt Director
Tollywood
Hollywood

More Telugu News