నామినేషన్ల ప్రక్రియతో వేడెక్కిన బిగ్ బాస్ హౌస్!

Bigg Boss 6  Update
  • బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికరంగా సాగిన నామినేషన్స్ 
  • గీతూను ఎక్కువగా నామినేట్ చేసిన సభ్యులు 
  • ఇనయాతో జరిగిన మాటల యుద్ధం
  • సూర్య వెళ్లిపోవడానికి ఇనయాను బాధ్యురాలిని చేసిన సభ్యులు  
57వ రోజున బిగ్ బాస్ హౌస్ మరింత వేడెక్కింది. ప్రతి సోమవారం మాదిరిగానే ఈ సోమవారం కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. పోటీదారుల ఎదురుగా దిష్టి బొమ్మల తరహాలో గడ్డి బొమ్మలు ఉంచారు. ఆ గడ్డి బొమ్మల మెడపై కుండను ఉంచి, నామినేట్ చేయడానికి గల కారణం చెప్పి ఆ కుండను పగుల గొట్టాలి. ఈ నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా కొనసాగింది. పోటీదారులందరిలో గీతూ .. ఇనయా ఎక్కువమంది చేత నామినేట్ అయ్యారు.

చేపల టాస్క్ సమయంలో సంచాలక్ గా ఉన్న సమయంలో గీతూ ధోరణి తమకి నచ్చలేదనే కారణాన్ని ఎక్కువమంది చెప్పారు. గీతూ మాత్రం ఎప్పటిలానే వాళ్ల వాదనలను తేలిగ్గా కొట్టిపారేసింది. ఆ తరువాత నుంచి ఒక్కసారిగా ఫోకస్ అంతా ఇనయా వైపుకు వెళ్లింది. ఇనయాను ఫైమా నామినేట్ చేసిన సందర్భంలో ఇద్దరి మధ్యా మాటా మాట పెరిగింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రేవంత్ .. ఆదిరెడ్డి .. శ్రీసత్య లతోను ఇనయాకి పెద్ద వాదనే జరిగింది. 

ఇనయా విషయంలో అందరూ కూడా సూర్య ప్రస్తావన తీసుకొచ్చారు. అతను హౌస్ నుంచి వెళ్లిపోవడానికి కారణం ఆమెనే అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక హౌస్ కి కెప్టెన్ గా ఉన్న శ్రీహాన్ కూడా ఇనయాను నామినేట్ చేస్తూ ఇదే రీజన్ చెప్పాడు. సూర్యతో ఫ్రెండ్లీగా ఉంటూ వెన్నుపోటు పొడిచావనీ .. ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చావంటూ నామినేషన్ల ప్రక్రియకు ముగింపు పలికాడు. అందరితో మాటల యుద్ధం చేసిన ఇనయా చివర్లో కన్నీళ్లు పెట్టుకుంది.
Go Back to Shorts
Inaya
Revanth
Adi Redddy
Sri Sathya
Geethu

More Telugu News