ఆనంద్ రవి 'కొరమీను' టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన లావణ్య త్రిపాఠి
Add ap7am to your home Screen

ఆనంద్ రవి 'కొరమీను' టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi releases Korameenu title motion poster
  • ఆనంద్ రవి హీరోగా కొరమీను
  • శ్రీపతి కర్రి దర్శకత్వంలో చిత్రం
  • హీరో ఆనంద్ రవి ఫస్ట్ లుక్ విడుదల
ఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'కొరమీను'. ఈ చిత్రానికి శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. సినీ ప్రేమికుల కోసం ఈ సినిమా నుంచి అప్ డేట్ వచ్చింది. హీరో ఆనంద్ రవి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు టైటిల్ వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను అందాల హీరోయిన్ లావణ్య త్రిపాఠి విడుదల చేశారు.

'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అంటూ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఆ పోస్టర్ ను చిత్రబృందం పంచుకుంది. ఆనంద్ రవి ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కూడా ఓ బోట్ మీద ఆ లైన్స్ కనిపించాయి. 'కొరమీను' ఫస్ట్ లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తే... సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథగా తెలుస్తోంది. 

దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ ''ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన లావణ్య త్రిపాఠి గారికి థాంక్స్. కథ విషయానికి వస్తే... జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో కథ సాగుతుంది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు - ఈ ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు. 

ఈ చిత్రంలో కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర హీరో ఆనంద్ రవి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించడం విశేషం.
Korameenu
Title
Anand Ravi
Motion Poster

More Telugu News