కొన్ని నెలల ముందు నుంచే బ్రెయిన్ స్ట్రోక్ సంకేతాలు!

21-10-2022 Fri 15:13 | Health
  • మనిషి పాలిట ప్రాణాంతకం బ్రెయిన్ స్ట్రోక్
  • ఇస్కీమిక్, హెమరేజిక్ స్ట్రోక్ లతో ముప్పు
  • ప్రారంభ లక్షణాలతో అప్రమత్తం అవ్వాలన్న నిపుణులు
శరీరంలో ఏ భాగానికి రక్తప్రసరణ సరిగా జరగకపోయినా అక్కడి కణజాలం దెబ్బతింటుంది. శరీరం మొత్తానికి అంత్యంత కీలక భాగం అయిన మెదడుకు రక్త ప్రసరణ సరిగా లేకపోయినా, మెదడులో రక్తనాళాలు చిట్లిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. ఇది పక్షవాతానికి దారితీయడమే కాదు, ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది. 

అయితే, బ్రెయిన్ స్ట్రోక్ సంకేతాలు కొన్ని నెలల ముందు నుంచే కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు చాలా మామూలుగానూ, గుర్తించలేని విధంగా ఉంటాయి. వెర్టిగో (తల గిర్రున తిరగడం), వికారం, కళ్లు తిరిగి పడిపోతుండడం వంటి లక్షణాలను ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రారంభ దశగా భావించాల్సి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్లను సంప్రదించడం మంచిది. 

ఇవే కాదు... చేతుల్లో బలం తగ్గడం, కాళ్లు, చేతులతో సహా శరీరంలో ఒక వైపు మొద్దుబారినట్టు అయిపోవడం, మాటలు పలకడంలో తడబాటు, ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి, కంటిచూపు మందగించడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు ముందు హెచ్చరికల వంటివే. 

ఈ బ్రెయిన్ స్ట్రోక్... ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అనే రెండు రకాలుగా ఉంటుంది. రక్తనాళాల్లో అడ్డంకుల కారణంగా మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవడంతో ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవిస్తుంది. తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులో మృత కణజాలం పెరిగిపోతుంది. 

ఇక రక్తనాళం చిట్లిపోవడం, లేక రక్తనాళం నుంచి లీకేజిల కారణంగా ఏర్పడే బ్రెయిన్ స్ట్రోక్ ను హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ లక్షణాలు స్ట్రోక్ రాకముందు, వచ్చిన తర్వాత కొన్ని వారాలు, నెలల పాటు కొనసాగుతాయని 'ద స్ట్రోక్ అసోసియేషన్' పేర్కొంది.

ఇక స్ట్రోక్ సంభవించినప్పుడు ముఖంలో ఓవైపు భాగం లాగుతున్నట్టుగా ఉండడం, మూతి వంకరపోవడం, సరిగా నవ్వలేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేతులు చచ్చుబడినట్టుగా ఉన్నా, నాలుక మడతపడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రందించాలి.
Brain StrokeSignsHealthHuman

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more