TDP: విజయవాడలో కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం

tdp starts 2 anna cnateeens in vijayawada
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడలో బుధ, గురు వారాల్లో రెండు అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం కాగా... గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభిరాం, నాగుల్ మీరా తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ... పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అన్నా క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి రాగానే మూసివేశారని ఆయన ఆరోపించారు. అన్నా క్యాంటీన్ పేరు నచ్చకపోతే వైఎస్సార్ పేరు పెట్టుకుని అయినా వీటిని కొనసాగించాల్సి ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
TDP
Budda Venkanna
Vijayawada
Pattabhi
Kesineni Sivanath
Anna Canteen

More Telugu News