మఫ్టీలో ఉన్న ఐదుగురు వ్యక్తులు నన్ను గంటల తరబడి కొట్టారు: దారపనేని నరేంద్ర
- బుధవారం రాత్రి నరేంద్రను అదుపులోకి తీసుకున్నసీఐడీ
- రాత్రంతా సీఐడీ కస్టడీలోనే నరేంద్ర
- దెబ్బలు కనిపించకుండా తనను కొట్టారన్న నరేంద్ర
- టీడీపీ నేతలు, లాయర్లకు చెప్పిన వైనం
వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చిన సందర్భంగా టీడీపీ నేతలు, తన న్యాయవాదులతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఐడీ అధికారుల కస్టడీలో ఉన్న తనను అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము 5.30 గంటల వరకు మఫ్టీలో ఉన్న ఐదుగురు వ్యక్తులు తనను కొట్టారని ఆయన వాపోయారు. అంతేకాకుండా దెబ్బలు బయటకు కనిపించకుండా ఆ వ్యక్తులు తనను కొట్టారని నరేంద్ర ఆరోపించారు.