Polar bear: తల్లితో ముద్దుగా మారాం చేస్తున్న పిల్ల ఎలుగుబంటి.. వైరల్‌ వీడియో ఇదిగో

Baby polar bear enjoying with mother in ice
షార్ట్స్‌లో చూడండి
చుట్టూ తెల్లని మంచు.. పొడిపొడిగా తెల్లగా మెరిసిపోతూ ఉన్న మంచులో ఓ పెద్ద ఎలుగుబంటి పడుకుని ఉంది. దాని పక్కనే పిల్ల ఎలుగుబంటి ఆడుకుంటోంది. ఆడుకోవడం కాదు.. మారాం చేస్తోంది. తల్లిపై పడి పొర్లుతూ, కొరుకుతున్నట్టుగా చేస్తూ, ముద్దు పెడుతూ ఆడుతోంది. దానికి తగ్గట్టుగా తల్లి కూడా పిల్లతో ఆడటం మొదలుపెట్టింది. ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో అన్వేషకులు ఈ వీడియోను చిత్రీకరించారు. చుట్టూ తెల్లని మంచు మధ్య తెల్లని మంచు ఎలుగుబంట్ల ఆట చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. దీనితోపాటు మరో తల్లీపిల్ల ఎలుగుబంట్ల జంట వీడియో కూడా ఆకట్టుకుంటోంది.

లక్షల కొద్దీ వ్యూస్..
  • ట్విట్టర్‌ లో పోస్టు చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 22 లక్షల వ్యూస్‌ వచ్చాయి. లక్షా 26 వేలకుపైగా లైకులు, వేల కొద్దీ రీట్వీట్లు వచ్చాయి. ‘పిల్ల ఎలుగుబంటి ఎంత ముద్దుగా ఉందో..’ అంటూ వందల మంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.
  • ‘అసలే తెల్లగా ఉండే మంచు ఎలుగుబంటి. అందులోనూ మరింత తెల్లగా మెరిసిపోతున్న పిల్ల ఎలుగుబంటి. భలేగా ఉన్నాయి..’ అని కొందరు నెటిజన్లు అంటుంటే.. ‘ప్రకృతి ఎంతో అందమైనది. మనం దాన్ని దెబ్బతీయకుండా ఉంటే మంచిది..’ అని ఇంకొందరు సూచిస్తున్నారు.
  • ‘మనుషులైనా, జంతువులైనా తల్లీపిల్లల ప్రేమ, గారాబం ఒకేలా ఉంటుంది. చాలా మంచి దృశ్యమిది..’ అని మరికొందరు కామెంట్‌ చేశారు.
  • ఇక పలువురు నెటిజన్లు అయితే ఇలా అందమైన మంచు ఎలుగు బంట్లకు సంబంధించిన వీడియోలను కామెంట్ల కింద పోస్టు చేశారు. అవి కూడా చాలా మంది నెటిజన్లను అలరిస్తున్నాయి.
Go Back to Shorts
Polar bear
Baby bear
Ice
Offbeat
Viral Videos

More Telugu News