సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'!
- కొద్ది రోజుల్లోనే వైరల్ అయిన 'కాక్రోచ్ జనతా పార్టీ'
- ఇన్‌స్టాగ్రామ్‌లో 66 లక్షలకు పైగా ఫాలోవర్లు
- ప్రధాన రాజకీయ పార్టీలతో పోటీ పడుతున్న సెటైరికల్ వెబ్‌సైట్
- యువతే లక్ష్యంగా అభిజీత్ డిప్కే అనే వ్యక్తి రూపకల్పన
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. తాజాగా 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే ఓ సెటైరికల్ వెబ్‌సైట్ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పేజీకి కొన్ని రోజుల్లోనే 6.6 మిలియన్ల (66 లక్షల) మందికి పైగా ఫాలోవర్లు వచ్చి చేరారు.
అభిజీత్ డిప్కే అనే వ్యక్తి ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఆయన తనను తాను 'కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా' అభివర్ణించుకుంటున్నారు. "యువత చేత, యువత కొరకు, యువత యొక్క రాజకీయ వేదిక" అనేది ఈ పార్టీ నినాదంగా ఇన్‌స్టాగ్రామ్, 'ఎక్స్' ఖాతాల్లో పేర్కొన్నారు. ఇదంతా కేవలం వ్యంగ్యం (సెటైర్) మాత్రమేనని వెబ్‌సైట్‌లో స్పష్టంగా తెలిపారు. పార్టీలో చేరాలనుకునే వారి కోసం ఒక ఫారమ్‌ను కూడా అందుబాటులో ఉంచడం గమనార్హం.
ప్రస్తుతం ఈ పేజీలో సుమారు 50 వరకు ఇమేజ్‌లు, వీడియోలు (రీల్స్) ఉన్నాయి. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో పోలిస్తే ఈ సెటైరికల్ పేజీ ఫాలోవర్ల సంఖ్య ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి 1.9 మిలియన్లు, బీజేపీకి 8.7 మిలియన్లు, కాంగ్రెస్ పార్టీకి 13.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యంగ్య పేజీకి ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో ఆదరణ లభించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.