'విల్లంబు' ఫ్రీజ్!.. కొత్త గుర్తులు ఎంచుకోవాలని ఉద్ధవ్, షిండే వర్గాలకు ఈసీ ఆదేశం!
- శివసేనను చీల్చిన సీఎం ఏక్‌నాథ్ షిండే
- శివసేన కోసం, పార్టీ గుర్తు కోసం ఉద్ధవ్, షిండే వర్గాల మధ్య వివాదం
- ఎల్లుండి లోగా ఇతర గుర్తులు ఎంచుకోవాలని ఈసీ ఆదేశం
తాజాగా శనివారం ఉద్ధవ్‌తో పాటు షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ నోటీసు జారీ చేసింది. శివసేనకు ఇప్పటిదాకా కొనసాగుతున్న ఎన్నికల గుర్తు విల్లంబును ఇరు వర్గాలూ వినియోగించడం కుదరదని ఎన్నికల సంఘం తెలిపింది. రెండు వర్గాల మధ్య వివాదం తేలే దాకా ఈ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు కమిషన్ తెలిపింది. అంతేకాకుండా త్వరలో జరిగే ఉప ఎన్నికకు రెండు వర్గాలు తమ తమ గుర్తులను ఎంచుకోవాలని... అది కూడా రెండు రోజుల్లోగా తమ స్పందనను తెలియజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.