సీఎం జగన్ ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు

IAS Probation officers met CM Jagan at camp office
  • క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రొబేషన్ అధికారులు
  • సీఎం జగన్ తో భేటీ
  • పాలనాపారమైన అంశాలపై చర్చ
  • ఎస్ఈసీ ముఖేశ్ కుమార్ మీనాను కూడా కలిసిన ప్రొబేషన్ అధికారులు
ఏపీ సీఎం జగన్ ను 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషన్ అధికారులు నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. పాలనా పరమైన అంశాలపై వారు సీఎం జగన్ తో చర్చించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ వారి శిక్షణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేయాలని ఆ ప్రొబేషన్ అధికారులకు సూచించారు. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకు సాగాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

కాగా, ప్రొబేషన్ అధికారులు అమరావతి సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కూడా కలిశారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా అంశాలపై వారు మీనాను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయా అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించారు. 

ఈ సందర్భంగా, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విధానాన్ని ముఖేశ్ కుమార్ మీనా ప్రొబేషన్ అధికారులకు వివరించారు.
Go Back to Shorts
CM Jagan
Probation Officers
IAS
Andhra Pradesh

More Telugu News