Team India: అతికష్టం మీద 106 పరుగులు చేసిన సఫారీలు... టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం

Simple target to Team India
షార్ట్స్‌లో చూడండి
తిరువనంతపురంలో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా బౌలర్లు దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. తొలి టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. కేశవ్ మహరాజ్ 41 పరుగులు చేయగా, ఐడెన్ మార్ క్రమ్ 25, వేన్ పార్నెల్ 24 పరుగులు చేశారు. 

టీమిండియా బౌలర్ల ధాటికి ఓ దశలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీలు... 100 పరుగుల మార్కు అందుకున్నారంటే ఆ క్రెడిట్ కేశవ్ మహరాజ్ కే దక్కుతుంది. కేశవ్ మహరాజ్ 35 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సులతో విలువైన పరుగులు జోడించాడు. అతడికి పార్నెల్ నుంచి మంచి సహకారం లభించింది. 

సఫారీ ఇన్నింగ్స్ లో నలుగురు డకౌట్ అయ్యారు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, దీపక్ చహర్ 2, హర్షల్ పటేల్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Team India
South Africa
1st T20
Tiruvananthapuram

More Telugu News