Vijayasai Reddy: ఈ సినిమా కచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy hopes RRR can achieve Oscar
షార్ట్స్‌లో చూడండి
హాలీవుడ్ ఎంటర్టయిన్ మెంట్ మ్యాగజైన్ 'వెరైటీ' ఇటీవల ఓ కథనంలో టాలీవుడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రముఖంగా పేర్కొంది. ఈ సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లను పొందే అవకాశం ఉందన్నది ఆ కథనం సారాంశం. 

ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గీతం కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ పోటీ పడొచ్చని 'వెరైటీ' పేర్కొంది. దాంతో తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ లోనూ సత్తా చాటాలని కోరుకుంటున్నారు. 

ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందని వెల్లడించారు. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటిచెబుతున్నాయని తెలిపారు. 

గిరిపుత్రులు బ్రిటీష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం కచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Vijayasai Reddy
RRR
Oscar
Academy Awards
Hollywood
Tollywood

More Telugu News