Bandla Ganesh: యువ హీరోలపై బండ్ల గణేశ్ విమర్శలు

Bandla Ganesh comments on young heroes
షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఏం చేసినా ఒక సెన్సేషనే. జనసేనాని పవన్ కల్యాణ్ ను ప్రత్యక్ష దైవంగా భావించే ఆయన... తన మనసులోని మాటను ఏ మాత్రం సంకోచం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంటారు. ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతుంటారు. 

తాజాగా యువ హీరోలను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్ లో అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. వీరి తీరుపై బండ్ల గణేశ్ విమర్శలు గుప్పించారు. 'నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర. దయచేసి నేర్చుకోండి. ఆచరించండి. అది మన ధర్మం' అని ట్వీట్ చేశారు. దీనికి తోడు చేతులు కట్టుకుని వినయంగా కూర్చున్న పవన్ కల్యాణ్ ఫొటోను షేర్ చేశారు.
Go Back to Shorts
Bandla Ganesh
Adivi Sesh
Sudhu Jonnalagadda
Pawan Kalyan
Tollywood
Janasena

More Telugu News