Telangana: వచ్చే ఎన్నికల్లో పోటీపై సంచలన ప్రకటన చేసిన జగ్గారెడ్డి
ఏడాదిన్నరలో తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) బుధవారం సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. తన స్థానంలో సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తను బరిలోకి దించుతానని ఆయన మరో ఆసక్తికర ప్రకటన చేశారు.
తన భార్య నిర్మలతో కలిసి బుధవారం పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన సందర్భంగా జగ్గారెడ్డి ఈ ప్రకటన చేశారు. తనకు బదులుగా సంగారెడ్డికి చెందిన పార్టీ కార్యకర్తను బరిలోకి దించేందుకు పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోతే... తన స్థానంలో తన భార్య చేత పోటీ చేయిస్తానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పిన జగ్గారెడ్డి... 2028లో జరిగే ఎన్నికల్లో మాత్రం సంగారెడ్డి నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు.