భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్న 250 మంది ఉగ్రవాదులు
- పీఓకే లోని పలు లాంచ్ ప్యాడ్ ల వద్ద నిరీక్షిస్తున్న ఉగ్రవాదులు
- ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అలర్ట్ అయిన భారత సైన్యం
- సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసిన సైన్యం
మరోవైపు, ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గినప్పటికీ... డ్రగ్స్ మాత్రం పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతున్నాయి. డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బులతో పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ మాట్లాడుతూ, ఉగ్రవాదులే కాకుండా మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు భారత్ లో కి రాకుండా నిఘాను కట్టుదిట్టం చేశామని చెప్పారు. ఇంకోవైపు, జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ముష్కరులను భద్రతాదళాలు కాల్చి చంపాయి.