'హను మాన్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్!
- 'హనుమాన్' గా తేజ సజ్జ
- దర్శకుడిగా ప్రశాంత్ వర్మ
- కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
- త్వరలో ఐదు భాషల్లో విడుదల
ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ రీసెంట్ గా అయితే రాలేదు. ఈ రోజున తేజ సజ్జ పుట్టినరోజు కావడంతో, ఆయనకి విషెస్ చెబుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తలపాగా చుట్టి .. ఎద్దులబండిపై వెళుతూ, ఒక గ్రామీణ కుర్రాడిగా ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ మాస్ లుక్ లో ఆయన ఆకట్టుకుంటున్నాడు.
దసరాకి ఈ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ ఉంటుందని ప్రశాంత్ వర్మ మరింత ఆసక్తిని పెంచాడు. తేజ సజ్జ సరసన నాయికగా అమృత అయ్యర్ నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
.