మమ్ముట్టి.. సనత్ జయసూర్య ఒకేచోట చేరితే..!
- షూటింగ్ కోసం శ్రీలంక వెళ్లిన మమ్ముట్టి
- కొలంబోలో స్వాగతం పలికిన జయసూర్య
- షూటింగ్ ల కోసం శ్రీలంకకు రావాలని భారత నటులకు పిలుపు
కొలంబోలో మమ్ముట్టికి జయసూర్య సాదర స్వాగతం పలకడమే కాకుండా, ఆయనను అసలైన సూపర్ స్టార్ గా అభివర్ణించాడు. ఈ సందర్భంగా, భారత నటులు అందరూ షూటింగ్ ల కోసం శ్రీలంకకు రావాలని పులుపునిచ్చాడు. తమ భేటీకి సంబంధించిన ఫొటోలను జయసూర్య ట్విట్టర్ లో పంచుకున్నాడు.
‘‘మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు మమ్ముట్టిని కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. సర్, మీరు అచ్చమైన సూపర్ స్టార్. శ్రీలంకకు వచ్చినందుకు ధన్యవాదాలు. మా దేశానికి వచ్చి అనుభూతి పొందాలని భారత్ కు చెందిన అందరు నటులు, స్నేహితులను కోరుతున్నాను’’ అని జయసూర్య ట్వీట్ చేశాడు.
కడుగన్నవ ఒరు యాత్రాకురిప్ సినిమాలో మమ్ముట్టి నటిస్తున్నారు. ఎంటీ వాసుదేవ్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దీన్ని నేరుగా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయనున్నారు.