బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్లు వీరేనంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం!

  • సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6
  • ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్న నాగార్జున
  • ఉదయభాను, బాలాదిత్య, చలాకీ చంటి తదితరులు కంటెస్టెంట్లుగా ఉన్నారంటూ ప్రచారం
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను రియాల్టీ షో బిగ్ బాస్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఐదు సీజన్లు ప్రసారమవగా... అన్ని సీజన్లు టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోయాయి. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దీంతో, ఈసారి కంటెస్టెంట్లు ఎవరుంటారనే విషయం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు... బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరేనంటూ ఒక జాబితా వైరల్ అవుతోంది. ఈ జాబితాలో ఉదయభాను, శ్రీ సత్య, చలాకీ చంటి, అర్జున్ కల్యాణ్, ఇనయా సుల్తానా, బాలాదిత్య, సుదీప, శ్రీహన్, వాసంతి కృష్ణన్, ఆదిరెడ్డి, విశాల్ రాజ్, ఆరోహి రావ్, గీతు రాయల్, రేవంత్ ఉన్నారు. 

మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4 నుంచి ప్రసారం కాబోతోంది. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2కు నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా... సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5లను నాగ్ హోస్ట్ చేశారు. ఈ సీజన్ కు కూడా ఆయనే హోస్ట్ గా కొనసాగనున్నారు.

Big Boss Season 6
Contestants
Telugu
Nagarjuna
Udaya Bhanu

More Telugu News