బలహీనపడనున్న వాయుగుండం.. తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
- పశ్చిమ, వాయవ్య దిశగా ప్రయాణించనున్న వాయుగుండం
- నిన్న కూడా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు
- ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం
దీని ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా, నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.