నటి మీనా కీలక నిర్ణయం.. అవయవదానం చేస్తున్నట్టు ప్రకటన
- అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించిన మీనా
- ఒక్కరి అవయవ దానం ద్వారా 8 మందికి పునర్జన్మ లభిస్తుందన్న నటి
- ప్రతి ఒక్కరు అవయవదానం ప్రాముఖ్యాన్ని గుర్తించాలని కోరిన మీనా
కాగా, ఆరేళ్ల వయసులోనే సినిమా రంగంలోకి వచ్చిన మీనా ఎంతోమంది ప్రముఖులతో కలిసి నటించారు. మొత్తంగా 90 సినిమాల్లో నటించారు. ఇటీవలే తన భర్తను కోల్పోయిన మీనా.. ఆ లోటు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన మీనా భర్త విద్యాసాగర్‌కు సరైన సమయంలో ఊపిరితిత్తులు దొరక్క మరణించడంతోనే మీనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అవయవదానానికి ముందుకొచ్చిన మీనాపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.