రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్ష‌లు... వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయం చూసుకోవాల‌న్న పోలీసులు

traffic diverted on tankbund on saturday
  • ఉద‌యం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వ‌ర‌కు ఆంక్ష‌లు
  • స్వాతంత్య్ర దినోత్స‌వ వ‌జ్రోత్స‌వాల నేప‌థ్యంలో ట్యాంక్‌బండ్‌పై ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు
  • ఈ కార‌ణంగా ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్నామ‌న్న పోలీసులు
తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై శ‌నివారం ట్రాఫిక్ ఆంక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి. శ‌నివారం ఉద‌యం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్‌పై వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిషేధిస్తున్న‌ట్లు న‌గ‌ర ట్రాఫిక్ పోలీసు విభాగం శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేప‌థ్యంలో తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వ‌జ్రోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

ఇందులో భాగంగా శ‌నివారం ట్యాంక్‌బండ్‌పై ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార‌ణంగానే శ‌నివారం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ విష‌యాన్ని గుర్తుంచుకుని శ‌నివారం ఉద‌యం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాల‌నుకునే వాహ‌న‌దారులు... ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల‌ని సూచించారు.
Go Back to Shorts
Telangana
Hyderabad
Hyderabad Police
Tankbund
Traffic Police

More Telugu News