తనతో డేటింగ్ చేయాలనుందన్న బాలీవుడ్ భామకు టెక్ట్స్ మెసేజ్ పంపిన విజయ్ దేవరకొండ!
Add ap7am to your home Screen

తనతో డేటింగ్ చేయాలనుందన్న బాలీవుడ్ భామకు టెక్ట్స్ మెసేజ్ పంపిన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda text message to Sara
  • 'కాఫీ విత్ కరణ్' లో పాల్గొన్న సారా అలీ ఖాన్
  • ఎవరితో డేటింగ్ చేస్తావన్న కరణ్ జొహార్
  • విజయ్ పేరు చెప్పిన సారా
  • తాను 'రిలేషన్ షిప్' పదాన్ని కూడా సరిగా పలకలేనన్న విజయ్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్-ముంబయి మధ్య ఈ యువ హీరో చక్కర్లు కొడుతున్నాడు. కాగా, బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ 'కాఫీ విత్ కరణ్' లో తన వ్యాఖ్యలతో కలకలం రేపింది. "ఎవరితో డేటింగ్ కు వెళ్లాలనుకుంటున్నావు?" అని కరణ్ జొహార్ అడగ్గా, సారా అలీ ఖాన్ తడుముకోకుండా "విజయ్ దేవరకొండ" అని సమాధానం చెప్పింది.

అయితే దీనిపై విజయ్ దేవరకొండ స్పందన ఎలా ఉందో తెలుసుకుందామని జాతీయ మీడియా ప్రయత్నించింది. అందుకు విజయ్ బదులిస్తూ, 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే సారా అలీ ఖాన్ కు టెక్ట్స్ మెసేజ్ పంపించానని వెల్లడించాడు. ఆమె తనతో డేటింగ్ చేయాలని ఉందని చెప్పడం సంతోషానికి గురిచేసిందని తెలిపాడు. 

అయితే సారా డేటింగ్ ప్రతిపాదనకు ఏం సమాధానం చెబుతారని అడగ్గా... "రిలేషన్ షిప్ అనే పదాన్ని కూడా సరిగ్గా చెప్పలేని వాడ్ని... ఇక నేను ఆ సంబంధంలో ఎలా ఇమడగలను!" అంటూ తెలివిగా తప్పించుకున్నాడు.
Vijay Devarakonda
Text Message
Sara Ali Khan
Bollywood

More Telugu News