జనసేన వీర మహిళలను సత్కరించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

  • ఇటీవల కోనసీమలో వరదలు
  • సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించిన వీరమహిళలు
  • అభినందించిన పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ పార్టీ ప్రధాన కార్యాలయంలో వీరమహిళలతో సమావేశమయ్యారు. కోనసీమ ప్రాంతంలో వరద బాధితుల కోసం సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించి, బలంగా తమ గళాన్ని వినిపించారంటూ పవన్ కల్యాణ్ జనసేన వీరమహిళలను పేరుపేరునా అభినందించారు. వారికి శాలువాలు కప్పి సత్కరించారు. వారి కృషిని ప్రశంసిస్తూ జ్ఞాపికలు కూడా అందజేశారు. 

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జనసేన భవిష్య కార్యాచరణపై పవన్ వారితో చర్చించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల తరఫున మరింత బలమైన పోరాటాలు చేయాలని వారికి ఉద్బోధించారు.

Pawan Kalyan
Veera Mahila
Janasena
Floods
Konaseema
CM Jagan
Andhra Pradesh

More Telugu News