ప్రొఫెసర్ జయశంకర్‌తో కేటీఆర్!.. తనకిష్టమైన ఫొటోలలో ఇదొకటి అంటూ పోస్ట్ చేసిన తెలంగాణ మంత్రి!
- 2009లో జయశంకర్ ఇంటిలో కేటీఆర్ నిరసన హోరు
- కేసీఆర్ అరెస్ట్ తర్వాత నిరసనకు దిగినట్లు చెప్పిన కేటీఆర్
- ఆ మరునాడే జయశంకర్‌తో పాటు తననూ అరెస్ట్ చేశారని వెల్లడి
జయశంకర్‌తో కలిసి తాను తెలంగాణ కోసం నినాదాలు చేస్తున్న సందర్భంగా తీసిన ఫొటోను కేటీఆర్ పంచుకున్నారు. హన్మకొండలో 2009 నవంబర్ 29న జయశంకర్ ఇంటిలో ఈ ఫొటో తీశారని ఆయన వెల్లడించారు. తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్‌ను అలుగునూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేయగా... దానికి నిరసనగా తాను జయశంకర్‌తో కలిసి నినదించానని, ఆ తర్వాతి రోజు తమను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. తనను వరంగల్ జైలుకు తరలించిన పోలీసులు జయశంకర్‌ను మాత్రం ఖమ్మం జైలుకు తరలించారని కేటీఆర్ వివరించారు. తనకు ఇష్టమైన ఫొటోల్లో ఇదీ ఒకటి అంటూ ఆయన తెలిపారు.