రియల్ మీ వాచ్ 3 అమ్మకాలు నేటి నుంచే
- ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్లలో లభ్యం
- ఎన్నో ఫీచర్లు.. ధర రూ.3,499
- ఆరంభంలో రూ.500 డిస్కౌంట్
- బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్
బ్లాక్, గ్రే రంగుల్లో లభిస్తుంది. ప్లాస్టిక్ తో చేసిన వాచ్ ఇది. 1.8 అంగుళాల డిస్ ప్లే, ఐపీ68 రేటింగ్ తో వస్తుంది. ఈ వాచ్ లో 110 రకాల డిస్ ప్లే ఫేస్ లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ వాచ్ ను ఆండ్రాయిడ్ తోపాటు యాపిల్ ఫోన్లకు సైతం కనెక్ట్ చేసుకోవచ్చు. నిద్ర పోయే తీరు, రోజువారీగా ఎన్ని అడుగులు నడుస్తున్నారు? గుండె స్పందనల రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు, ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది?.. ఇలా ఎన్నింటినో ఈ వాచ్ ట్రాక్ చేయగలదు. రియల్ మీ వాచ్ 3 నుంచి బ్లూటూత్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే, స్మార్ట్ వాచ్ లోనే కాల్స్ రిసీవ్ చేసుకుని మాట్లాడొచ్చు. వాచ్ లో మైక్రోఫోన్, స్పీకర్ కూడా ఉన్నాయి.