Biryani: హైదరాబాద్​ లో వానకు కొట్టుకుపోయిన బిర్యానీ హండీలు.. వీడియో ఇదిగో!

Biryani pots float away in flood waters
షార్ట్స్‌లో చూడండి
వానొస్తే.. వరదొస్తుంది.. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లూ చేరుతాయి. ఇంట్లో వస్తువులు కొట్టుకుపోతుంటాయి. అంతా బాగానే ఉంది. కానీ హైదరాబాద్ లో మాత్రం ఓ చోట ఏకంగా బిర్యానీ గిన్నెలు కొట్టుకుపోవడం ఆసక్తిగా మారింది. అదీ ఒకటి కాదు.. ఒకదానిపై ఒకటి పెట్టిన రెండు పెద్ద పాత్రలు అలాగే నీటిలో కొట్టుకుపోయిన వీడియో వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలోని ‘ఆదిబా హోటల్’ ముందు ఈ ఘటన జరిగింది.

  • ఈ నెల 29న సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో నవాబ్ సాహెబ్ కుంట నిండిపోయి ఉప్పొంగింది. అది అసలే లోతట్టు ప్రాంతం కావడంతో రోడ్లపై నీళ్లు ప్రవహించాయి. ఈ క్రమంలో ఆదిబా హోటల్ ముందు ఒకదానిపై మరొకటి పెట్టిన రెండు పెద్ద బిర్యానీ గిన్నెలు కొట్టుకుపోతుండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టారు.
  • ‘‘బిర్యానీ గిన్నెలు కొట్టుకుపోతున్నాయి. ఎవరికో బిర్యానీ ఆర్డర్ అందక డిసప్పాయింట్ అయిఉంటారు. ఈ బిర్యానీ గిన్నెలు ఎవరి ఇంటికి చేరుతాయోగానీ వారికి మాత్రం పండుగే...” అంటూ సదరు వ్యక్తి కామెంట్ పెట్టారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది.
  • ‘‘ఇదో సరికొత్త హోం డెలివరీ సర్వీసులా ఉంది’ అంటూ కొందరు.. ‘ది గ్రేట్ ఎస్కేప్’ అంటూ మరికొందరు. ‘బిర్యానీ దొరికినోడికి ఫుల్లు పండగే..’ అంటూ మరికొందరు కామెంట్లు పెట్టేస్తున్నారు.
Go Back to Shorts
Biryani
Hyderabad
Telangana
Rains
Floods
Biryani Hundi
Twitter
Viral Videos
Offbeat

More Telugu News