కేసీఆర్ ను ఓడించడమే నా జీవిత లక్ష్యం: ఈటల రాజేందర్
- టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్న ఈటల
- త్వరలోనే బీజేపీలోకి ఊహకు అందనంత చేరికలు ఉంటాయని వెల్లడి
- రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని విమర్శ
టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన నేతలు తనతో టచ్ లో ఉన్నారని... త్వరలోనే ఊహకు అందనంత స్థాయిలో చేరికలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతో కాలంగా తనకు మంచి మిత్రుడని... ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని అన్నారు. హుజూరాబాద్ ప్రజల కాలికి ముళ్లు గుచ్చుకుంటే నోటితో పీకే వ్యక్తి ఈటల అని చెప్పారు.