బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ దిగంబర అవతారంపై పోలీసులకు ఫిర్యాదు
- ఇన్ స్టాగ్రామ్ లో రణవీర్ నగ్నఫొటోలు
- ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ మోడలింగ్
- రణవీర్ పై వెల్లువెత్తిన విమర్శలు
- పోలీసులను ఆశ్రయించిన స్వచ్ఛంద సేవాసంస్థ
రణవీర్ సింగ్ తన చర్యల ద్వారా మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా వ్యవహరించాడని, వారి మనోభావాలను దెబ్బతీశాడంటూ ముంబయిలోని చెంబూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలైంది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రణవీర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఓ స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధి ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు. ఐటీ యాక్ట్, ఇతర సెక్షన్ల కింద రణవీర్ సింగ్ పై కేసు నమోదు చేయాలని కోరారు.
దీనిపై ముంబయి పోలీసులు స్పందించారు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ పై ఫిర్యాదు అందిందని, అయితే తాము ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. ప్రాథమిక విచారణ జరుపుతున్నామని తెలిపారు.