కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో డోపింగ్ కలకలం
- జులై 28 నుంచి కామన్వెల్త్ క్రీడలు
- ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా క్రీడోత్సవం
- మహిళల రిలే టీమ్ లో ఓ అథ్లెట్ తొలగింపు
- నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్టు సమాచారం
ఆ అథ్లెట్ పేరును భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) బయటపెట్టలేదు. ఈ పరిణామం అనంతరం, మహిళల రిలే టీమ్ లో ప్రస్తుతం నలుగురు సభ్యులే ఉన్నారు. తొలగించిన అథ్లెట్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది తెలియరాలేదు. కామన్వెల్త్ క్రీడలు ఈసారి ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి.