తెలంగాణలో కొత్తగా 531 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 24,927 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 281 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 612 మంది
- ఇంకా 4,630 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,14,303 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,05,562 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,630 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
