Team India: రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్... బౌలింగ్ కు దిగిన టీమిండియా

West Indies won the toss in 2nd ODI against Team India
షార్ట్స్‌లో చూడండి
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య నేడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడి క్వీన్స్ పార్క్ ఓవల్ ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అవేష్ ఖాన్ ను జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. అవేష్ ఖాన్ ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడని ధావన్ వివరించాడు. 

కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ఓపెనర్లు కైల్ మేయర్స్ 6, షాయ్ హోప్ 5 పరుగులతో ఆడుతున్నారు.
Go Back to Shorts
Team India
Toss
West Indies
2nd ODI
Port Of Spain

More Telugu News