వేగంగా దూసుకొచ్చి న‌లుగురి ప్రాణాలు తీసిన అంబులెన్స్... వీడియో ఇదిగో

four people died in a ambulance toppled at a toll gate in karnataka
  • క‌ర్ణాట‌క‌లోని ఉడుపిలో ఘ‌ట‌న‌
  • వేగంగా దూసుకువ‌చ్చి అడ్డంగా తిరిగిపోయిన అంబులెన్స్‌
  • టోల్ ప్లాజా సిబ్బందిని ఢీకొని ఆపై తిర‌గ‌బ‌డిపోయిన వైనం
  • ప్ర‌మాదంలో మ‌రో న‌లుగురికి గాయాలు
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలో ప్ర‌మాదానికి గురైన ఓ అంబులెన్స్ న‌లుగురి ప్రాణాలు తీసింది. కర్ణాట‌క‌లోని ఉడుపి జిల్లాలో బుధ‌వారం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రోగిని త్వ‌రిత‌గ‌తిన ఆసుప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలో మితిమీరిన వేగంతో వ‌చ్చిన స‌ద‌రు అంబులెన్స్ ఓ టోల్ ప్లాజా వ‌ద్ద అదుపు త‌ప్పింది. టోల్ ప్లాజాలో ప‌నిచేసే సిబ్బందిని ఢీకొట్టిన అంబులెన్స్ ఆపై జారుకుంటూ అల్లంత దూరం వెళ్లి బోల్తా ప‌డింది. 

ఈ ఘ‌ట‌న‌లో అంబులెన్స్ డ్రైవ‌ర్ స‌హా న‌లుగురు చ‌నిపోగా... మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. అంబులెన్స్ టోల్ ప్లాజాకు స‌మీపిస్తున్న స‌మ‌యంలో వాహ‌నాల దారిలో ప‌డిపోయిన ఓ డివైడ‌ర్‌ను తీసేందుకు వెళ్లిన టోల్ ప్లాజా ఉద్యోగి... అంబులెన్స్ వేగంగా దూసుకురావ‌డంతో బిత్త‌ర‌పోయాడు. అంబులెన్స్ నుంచి త‌ప్పించుకునేందుకు అత‌డు చేసిన య‌త్నాలు స‌ఫ‌లం కాలేదు. వేగంగా వ‌చ్చి అడ్డంగా తిరిగిన అంబులెన్స్ తొలుత ఆ టోల్ ప్లాజా ఉద్యోగినే ఢీకొట్టింది. ఆపై నేల‌పై జారుకుంటూ వెళ్లి ప‌ల్టీ కొట్టింది. దీంతో డ్రైవ‌ర్ కేబిన్‌లోని వారంతా టాప్ లేచిపోవ‌డంతో ఎగిరి ప‌డ్డారు.
Go Back to Shorts
Karnataka
Ambulance
Toll Plaza
Road Accident
Crime News

More Telugu News