ఒకే రోజు.. ఒకే వేదికపై.. 53 ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ!
- కొత్తగా కుదిరిన ఒప్పందాలు 26
- ఒప్పందాలను పునరుద్ధరించుకున్న 27 కంపెనీలు
- వీటి ద్వారా 1.50 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్న ప్రభుత్వం
ఇక 26 కొత్త ఒప్పందాలు కుదిరిన ఈ వేదిక మీదే... వీటికి అదనంగా 27 కంపెనీలు తమ ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వంతో పునరుద్ధరించుకుంటూ సంతకాలు చేశాయి. వెరసి ఒకే వేదిక మీద 53 ఒప్పందాలు జరిగాయి. బుధవారం కుదిరిన ఈ ఒప్పందాల ద్వారా తెలంగాణకు చెందిన 1.50 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ వెల్లడించింది.