PT Usha: ఎంపీగా మారిన ప‌రుగుల రాణి!.. సంతోషంగా ఉందంటూ మోదీ ట్వీట్‌!

pm modi post his photo with pt usha in parliament
షార్ట్స్‌లో చూడండి
భార‌త‌ ప‌రుగుల రాణి పీటీ ఉష రాజ్య‌స‌భ సభ్యురాలిగా మారిపోయారు. ఇటీవ‌లే ద‌క్షిణాదికి చెందిన న‌లుగురు ప్ర‌ముఖులు రాష్ట్రప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన సంగ‌తి, వీరిలో పీటీ ఉష కూడా ఉన్న విష‌యం తెలిసిందే. కొత్త‌గా రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన వారిలో పలువురు సోమవారమే ప్రమాణ స్వీకారం చేయగా.. పీటీ ఉష బుధవారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు.

తాజాగా బుధ‌వారం పార్ల‌మెంటులో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని పీటీ ఉష క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆమెతో వున్న ఫొటోను మోదీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పార్ల‌మెంటులో పీటీ ఉష‌ను చూడ‌టం సంతోషంగా ఉందంటూ మోదీ త‌న ట్వీట్‌కు ఓ కామెంట్ జ‌త చేశారు. ఇదిలా ఉంటే... రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేస్తున్న వీడియోను పీటీ ఉష సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 
Go Back to Shorts
PT Usha
Parliament
Rajya Sabha
Prime Minister
Narendra Modi
Twitter

More Telugu News